Sanjana Sanghi : సినిమాల విషయం పక్కన పెడితే ఈ మధ్యన కుర్ర హీరోయిన్‌లు ఫ్యాషన్ దుస్తులను ధరించి తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో తమ క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా కొనసాగుతోంది. టీవీ నటీమణుల నుంచి స్టార్ హీరోయిన్‌ల వరకు అందరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అందరి మనసును తమవైపుకు తిప్పుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దిల్ బేచారా ఫేమ్ నటి సంజనా సంఘీ హాట్ ఫోటో షూట్ చేసి యూత్ మైండ్ బ్లాక్ చేసింది. ఎప్పుడూ తన ఫ్యాషన్ డైరీల నుంచి స్నిప్పెట్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంది. ఈ చిన్నది లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అదిరిపోయే అవుట్‌పిట్‌తో అందరిని ఇంప్రెస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అవుట్‌ఫిట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Sanjana Sanghi : ఫ్రెండ్స్‌తో డే అవుట్ కు అయినా , పార్టీస్ అయినా ఫంక్షన్‌లైనా అకేషన్‌ను బట్టి స్టన్నింగ్ అవుట్ ఫిట్స్‌ను ధరించి అలరిస్తుంది సంజనా. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సంజనా సంఘీ స్టన్నింగ్ ప్యాంట్ సూట్‌ను ధరించింది. కంఫర్ట్, స్టైలిష్ లుక్స్‌లో ఉండే అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకునే ఈ చిన్నది అదే స్టైల్‌లో ప్యాంట్ సూట్ వేసుకుని తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. రెడ్ కార్పెట్‌పైన స్పెషల్ గా కనిపించింది . ఈ అవుట్‌ఫిట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సంజన ఫాలో అయ్యే ఫార్మల్ ఫ్యాషన్ డైరీస్ అందరి ఫేవరేట్ అని చెప్పాలి. రోజు రోజుకు తన ఫ్యాషన్ పరిధిని ఈ భామ పెంచుకుంటూనే ఉంటోంది. అవార్డ్స్ ఫంక్షన్ కోసం సంజన ఫ్యాషన్ డిజైనర్ నికితా వాద్వా మైసల్కర్ కు మ్యూజ్‌గా వ్యహరిస్తోంది. ఈ ఫోటో షూట్ కోసం ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన సీక్విన్డ్ మెరూన్ బ్రా వేసుకుని దానికి జోడీగా జరీ సిల్వర్ స్టోన్ డీటైల్స్‌తో వచ్చిన బ్లేజర్ వేసుకుంది. దీనికి జోడీగా వైడ్ లెగ్స్‌తో వచ్చిన సీక్విన్డ్ ఫార్మల్ మెరూన్ ట్రౌజర్‌ను ధరించింది.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఆక్వామెరైన్ జ్యువెల్లరీ నుంచి ఎన్నుకున్న సిల్వర్ స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ మీరా, సంజన కు అందమైన లుక్స్‌ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ రియా, సంజన అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది. కనులకు మెరూన్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్ , మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.