Sanjana-sanghi : బాలీవుడ్ బ్యూటీ సంజన సంఘీ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ ఫ్యాషన్ ప్రియులను చంపుతుంటుంది. క్యాజువల్ లుక్స్ లో కనిపించడం దగ్గరి నుండి పండుగ దుస్తులలో మెరవడం వరకు ప్రతి అవుట్ ఫిట్ లో అద్భుతంగా కనిపిస్తూ అలరిస్తుంటుంది ఈ చిన్నది. అకేషన్ కు తగ్గట్లుగా అన్ని రకాల ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ మెప్పిస్తుంటుంది. తాజాగా సంజన సముద్ర తీరాన అదిరిపోయే లెహెంగా సెట్ వేసుకుని హాట్ లుక్స్ తో అందరిని మెస్మెరైజ్ చేసింది.

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ టొరానీకి సంజన మ్యూజ్ గా వ్యవహరించింది. డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన లెహెంగాను తన ఫోటో షూట్ కోసం ఎంచుకుంది. ఈ ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ అమేజింగ్ గా కనిపించింది.

డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన స్ట్రిప్డ్ డిజైన్స్ కలిగిన మెరూన్ స్లిప్ బ్లౌజ్ ను వేసుకుంది సంజన. దీనికి మ్యాచింగ్ గా మెరూన్ కలర్ లో మినిమల్ ఎంబ్రాయిడరీ వర్క్ తో పాస్టెల్ బ్లూ జార్జెట్ ప్లీట్స్ , డెకరేషన్ లు కలిగి ఉన్న కాంట్రాస్టింగ్ ఫ్లూ స్కర్ట్ వేసుకుని స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టింది.

ఈ సెట్ కు మ్యాచింగ్ గా సరిహద్దుల వద్ద ఎంబ్రాయిడరీ చేసిన జరీ వివరాలు కలిగిన జార్జెట్ పాస్టెల్ నీలిరంగు దుపట్టా ను వేసుకుని తన రూపాన్ని పూర్తి చేసింది.

ఈ అవుట్ కు మ్యాచ్ అయ్యేలా ఎమరాల్డ్ స్టోన్స్ పొదిగిన మెరూన్ నెక్ చోకర్ తన మేడలో అలంకరించుకుంది సంజన

ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రియాంక కాస్టెలిన్నో సంజనకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకుని సంజన సముద్రం బ్యాక్‌డ్రాప్ లో దిగిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేసాయి.

మేకప్ ఆర్టిస్ట్ రియా డి షెత్ సహాయంతో సంజన తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కర పెట్టుకుని, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని అందరిని తన అందాలతో అలరించింది.