డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంజన గల్రాని బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు షూటింగ్ కోసం వెళ్ళడానికి ఓలా క్యాబ్ బుక్ చేశారు.క్యాబ్ లోకి ఎక్కిన కొంతసేపటికి ఆమె తన డెస్టినేషన్ ను మార్చాలని డ్రైవర్ ను కోరగా అతడు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు వారు డెస్టినేషన్ ను మార్చడం కుదరదని చెప్పడంతో తాను ఏం చేయలేనని డ్రైవర్ చేతులు ఎత్తేశాడు.దీంతో ఆగ్రహించిన సంజన డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి అతన్ని దూషించింది.ఈ వ్యవహార్నాంత రికార్డ్ చేసిన డ్రైవర్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సంజన డబ్బులు కట్టిన సరిగ్గా లేని కార్ ను పంపిన ఓలా పై ఫైర్ అయ్యారు.అలాగే క్యాబ్ లో ఏసిని పెంచమని అడిగితే డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడి ప్రవర్తన నచ్చని నేను కార్ లో ఉండగనే 100కు డైల్ చేసి అతడిపై కంప్లైంట్ చేశానని ట్వీట్ చేశారు.
https://twitter.com/sanjjanagalrani/status/1445267308536942593?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445267308536942593%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F