Sania Mirza : దీపావళి దాదాపుగా వచ్చేసినట్టే. బాలీవుడ్ తారలు ఫెస్టివ్ ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్, శోభితా ధూళిపాళ, మలైకా, మౌనీ రాయ్‌లు అందరూ డార్క్ షేడ్స్ కలిగిన ఎత్నిక్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. అయితే పాస్టెల్ టోన్డ్ ఎత్నిక్ వేర్లను ధరించి అదరగొట్టవచ్చని స్టార్ అథ్లెట్ సానియా మిర్జా రుజువు చేస్తోంది.

Sania Mirza : లాక్మే ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్ అనుశ్రీ రెడ్డికి సెలబ్రిటీ షో స్టాపర్‌గా వ్యవహరించింది సానియా మిర్జా. ఈ సందర్భంగా సానియా ధరించిన అవుట్‌ఫిట్ లో డిజైనర్ అనుశ్రీ తన సిగ్నేచర్ ఫ్యాషన్ ను స్పష్టంగా చూపించింది. మిసెస్ సానియా మిర్జా షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ ను వేసుకుని దానికి మ్యాచింగ్ గా సిల్వర్ బీడ్స్, సీక్విన్ వర్క్స్, ఫ్లోరల్ అలంకరణలతో ఎంబ్రాయిడరీ చేసిన బ్లష్ పింక్ టోన్ కలిగిన భారీ లెహెంగాను ధరించి అదరగొట్టింది.

సానియా భుజం మీదుగా నెట్ ఫ్యాబ్రిక్ అంతటా పూల ఎండ్రాయిడరీతో డిజైన్ చేసిన షీర్ దుపట్టాను వేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌కు కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చని రాళ్లను పొదిగిన నెక్లెస్ పెట్టుకుంది. చేతికి వజ్రాలతో డిజైన్ చేసిన కంకణం, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెరిసింది. పెదాలకు గ్లాసీ లిప్ షేడ్ పెట్టుకుని న్యూట్రన్ టోన్డ్ మేకప్‌లో గ్లామరస్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది సానియా మిర్జా. ఈ భారీ లెహెంగాను వేసుకుని ర్యాంప్ పైన వయ్యారంగా నడిచి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

సానియా మిర్జా భారతీయ ప్రొఫెషనల్ టెన్నీస్ ప్లేయర్ . ఆరవ ఏట నుంచే టెన్నిస్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో సందడి చేసింది. నాన్న ఇమ్రాన్ మిర్జా, రోగర్ ఆండెర్సన్ సానియాకు టెన్నిస్‌లో కోచింగ్ ఇచ్చారు. ఆ తరవాత హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సానియా మిర్జా. సానియాకు టెన్నిస్ లోనే కాదు క్రికెట్, స్మిమ్మింగ్లోనూ మంచి అనుభవం ఉంది. 2003లో ప్రొఫెషనల్‌గా టెన్నిస్ ఆడటం ప్రారంభించింది సానియా.జూనియర్ ప్లేయర్‌గా 10 సింగిల్స్, 13 డబుల్స్‌లో టైటిల్స్‌ను సాధించింది. అలా అథ్లెట్‌గా అంచలంచెలుగా ఎదిగి భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది సానియా. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఆటకు కాస్త బ్రేక్ వేసింది.

తన నైపుణ్యంతో కేవలం టెన్నిస్ ఆటలో అదరగొట్టడమే కాదు. ఫ్యాషన్ రంగంపైన సానియాకు మంచి పట్టుంది. అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది సానియా. ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సానియా మిర్జా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరచదు. తన పర్సనల్ విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. రీసెంట్గా సానియా సీక్విన్స్‌తో డిజైన్ చేసిన ఫుల్ స్లీవ్స్ ఫ్రాక్ను వేసుకుని అదరగొట్టింది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం వేసుకున్న ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపించి తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసింది.

