బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.రాధే శ్యామ్ మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ తన తదుపరి మూవీ షూటింగ్స్ లో బాగా బిజీగా ఉన్నారు.అర్జున్ రెడ్డి మూవీతో యావత్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నారు.ఈ మూవీ కోసం ప్రభాస్ 140 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు.దీంతో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు.తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు సందీప్ నేను ప్రభాస్ అన్న అభిమానుల్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచను ఇది నేను మీకు ఇస్తున్న ప్రామిస్ అని అన్నారు.