సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు ఇండియన్ వైజ్ గా మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళ్ భాషలలో పాన్ ఇండియా హీరోయిన్ అనే గుర్తింపుని సొంతం చేసుకున్న రష్మిక మరో వైపు బాలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ రెండు సినిమాలు ఒటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రష్మిక మందనకి సోషల్ మీడియాలో మాతృభాష నుంచి నెగిటివిటి పెరిగిపోతుంది. దీనికి కారణం పలు ఇంటర్వ్యూలు ఆమె తన మొదటి సినిమా కిరీక్ పార్టీ గురించి ప్రస్తావించకపోవడం ఒకటి అయితే, తనకి మొదటి అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు కూడా పలకడానికి ఇష్టపడకపోవడం మరో కారణంగా కనిపిస్తుంది.
అలాగే రిషబ్ శెట్టి రీసెంట్ గా చేసిన కాంతారా మూవీ గురించి కనీసం ఒక్క మాట కూడా ఆమె ట్విట్టర్ లో చెప్పకపోవడం కూడా మరో కారణంగా ఉంది. కాంతారా సినిమా గురించి ఇండియన్ వైడ్ గా టాప్ స్టార్స్ అందరూ స్పందించి ప్రశంసలు కురిపిస్తే కనీసం రష్మిక సినిమా కూడా చూడలేదని కన్నడీగులు ఫీల్ అవుతున్నారు. అలాగే కనీసం విషెస్ కూడా కాంతార సినిమా కోసం చెప్పలేదని హర్ట్ అయ్యారు. దీంతో కన్నడ నెటిజన్లు రష్మికని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనిపై ఆమె కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
అయితే రష్మిక వ్యవహారం కన్నడ ప్రేక్షకులనే కాకుండా కన్నడ ఇండస్ట్రీ వారిని కూడా బాధపెట్టిందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కన్నడ ఇండస్ట్రీ రష్మిక మీద అనాధికార బ్యాన్ విధించారనే మాట వినిపిస్తుంది. ఇకపై ఏ కన్నడ హీరో పక్కన, అలాగే కన్నడ సినిమాలలో ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేయకూడదు అని డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.