సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వినోదాయ సిత్తం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మాతృకలో సముద్రఖని మెయిన్ లీడ్ లో దేవుడిగా నటించాడు. ఈ సినిమా అక్కడ తక్కువ బడ్జెట్ లో వచ్చి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కించడానికి రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ కోసం ఓ 40 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు టాక్. కంటెంట్ అందులోని దేవుడి క్యారెక్టరైజేషన్ బాగా కనెక్ట్ కావడం వలనే పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ఒకే చెప్పాడని తెలుస్తుంది.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్తారని సమాచారం. అయితే ఏ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీనిపై నిర్మాతలు స్పందించారు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో ఈ రీమేక్ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. సాయి తేజ్ ఇప్పటికే మూవీ షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడని, దర్శకుడు సముద్రఖని కూడా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ ఇవ్వగానే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే అది మొదలవుతుంది అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో కూడా చేయాల్సి ఉంది. దానిని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.