Samantha : సెలబ్రెటీల విషయంలో ఏం జరిగినా ప్రతిదీ వార్తే. సెలబ్రిటీల కుక్కపిల్ల తప్పిపోయినా వార్తే. మొక్క పువ్వు పూసిన వార్తే. ఇక గాలి వార్తలకైతే కొదువ లేదనుకోండి. ఇటీవలి కాలంలో అంటే హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం వదంతులను ఎదుర్కొంటున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె షూటింగ్‌లో పాల్గొన్నా లేకపోయినా వార్తే. మనస్పర్థల కారణంగా టాలీవుడ్ నటుడు నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత గురించి రకరకాల ప్రచారం ట్రోలింగ్ అవుతుందనే చెప్పాలి. ఆమె అందాలారబోత దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేయడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.
ఆ మధ్య ఈ గాలి వార్తలకు దూరంగా సమంత తన స్నేహితురాలితో కలిసి విదేశాలు చుట్టి వచ్చింది. ఆ సమయంలో ఆమె స్కిన్ సమస్యతో బాధపడుతోందనే ప్రచారం హోరెత్తింది. దీంతో ఆమె మేనేజర్ స్పందిస్తూ సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. అయినా ఊరుకుంటారా? తిరిగి ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ గురించి అలాంటి వార్తే నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. పాలీమర్ ఫోర్స్ లైట్ ఎరప్షన్ అనే స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో సామ్ బాధపడుతోందని, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది.
Samantha : ఖుషి చిత్ర షూటింగ్‌లో బాధ పడిందట..
అసలీ ప్రచారాన్ని కేవలం ప్రచారంగానే కొట్టి పడేయాలా? లేదంటే నిప్పు లేనిదే పొగ రాదని సీరియస్‌గా తీసుకోవాలా? ఏం చేయాలనేది అర్ధం కాకుండా ఉంది. అయితే ఆమె స్కిన్ డిసీజ్ కారణంగా విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి చిత్ర షూటింగ్‌లో బాధ పడిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అదేవిధంగా యశోద చిత్రం కూడా నిర్మాణాంత కార్యక్రమాల దశలో ఉంది. సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఖుషి చిత్రంలో పాల్గొంటుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.