సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. దీని తర్వాత సమంత లీడ్ రోల్ లో రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ శాకుంతలం. ఈ సినిమా కూడా ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతోనే తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయడానికి గుణశేఖర్ సిద్ధం అవుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండతో మరో సినిమా సమంత చేస్తుంది. ఇదిలా ఉంటే నందిని రెడ్డితో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి గతంలో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అది క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలోకి రాహుల్ రవీంద్రన్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది.
తన సినిమాలకి మొదటి నుంచి డబ్బింగ్ చెబుతున్న చిన్మయితో సమంతకి మంచి అనుబంధం ఉంది. యశోద సినిమాకి సామ్ సొంత డబ్బింగ్ చెప్పుకున్నా కూడా అంతకు ముందు వరకు మెజారిటీ సినిమాలకి చిన్మయి సమంత పాత్రలకి డబ్బింగ్ చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఇక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీకి సామ్ ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ చివరిగా నాగార్జునతో మన్మధుడు2 సినిమా చేసి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
దాని తర్వాత మూడో సినిమా కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక చిన్మయి, రాహుల్ తో సమంతకి మంచి అనుబంధం ఉంది. ఈ నేపధ్యంలో రాహుల్ ఆమెతో ఒక ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని నిర్ణయించుకొని స్టోరీ కూడా చెప్పాడని టాక్. సమంత కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసిన తర్వాత రాహుల్ రవీంద్రన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో సామ్ ఉందని బోగట్టా.