సామ్,చై విడాకులు అనంతరం సోషల్ మీడియాలో సమంతపై ట్రోలింగ్ ఎక్కువైంది.సామ్,చై డైవర్స్ పై మీడియాలో అసత్య ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.తాజాగా దీనిపై స్పందించిన సమంత తన పరువుకి భంగం కలిగించేలా కొందరు ప్రచారం చేస్తున్నారని కోర్టు మెట్లు ఎక్కారు.ఈ అంశంపై మాట్లాడిన సమంత లాయర్ తాను వేసిన పిటిషన్ లో తెలుగు పాప్యులర్ టీవీ, సుమన్ టీవీ,సీఎల్ వెంకట్రావు సమంత పరువును తీసేలా కథనాలు ప్రచారం చేస్తున్నారని ఈ దుష్ప్రచారన్ని చేయకుండా వారికి ఆదేశాలను ఇవ్వాలని కోర్టును కోరబోతున్నామని చెప్పారు.ఈరోజు సాయంత్రం ఈ పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టులో విచారణ జరపనున్నది.