సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి మాతృభాషతో పాటు హిందీలో సక్సెస్ అయ్యి తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవాలని కలలు కంటుంది. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆమెకి హిందీలో క్రేజ్ పెంచేవే కావడం విశేషం. యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు. ఇక స్ట్రైట్ తెలుగు సినిమా అంటే విజయ్ దేవరకొండ ఖుషి మూవీ ఉంది. ఇది తమిళ్ కూడా రిలీజ్ అవుతుంది. వీటితో పాటు హిందీలో డెబ్యూ మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటాబెల్ వెబ్ సిరీస్ రీమేక్ ఉంది. ఇది కూడా స్ట్రైట్ హిందీ ప్రాజెక్ట్ గానే తెరకెక్కుతుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా సమంత ఉంది. ముఖ్యంగా చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ మాత్ర తగ్గకుండా సినిమాలు చేస్తుంది. తననితాను షో అప్ చేసుకోవడానికే ఇవన్నీ చేస్తుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత సమంత సినిమా గురించి కాకుండా ఆసక్తికరమైన పోస్ట్ ట్విట్టర్ లో పెట్టింది. తాను వేసుకున్న టీషర్ట్ మీద ఉన్న కొటేషన్ ని ట్వీట్ లో షేర్ చేసింది.
అందులో ఎప్పటికి నువ్వు ఒంటరిగా వెళ్లవు అనే మీనింగ్ వచ్చే విధంగా ఉంది. అయితే ఈ కొటేషన్ సమంత చైతన్యని ఉద్దేశించే చేసి ఉంటుందనే టాక్ ఇప్పుడు నెటిజన్స్ కామెంట్స్ లో తెలుస్తుంది. నాగ చైతన్య ఆలోచనలని చెబుతూ అతనికి అర్ధమయ్యే విధంగా ఈ కొటేషన్ పెట్టిందని అందరూ భావిస్తున్నారు. ఒక స్టేటస్, ప్రొఫైల్ పోస్ట్ ఎన్నో అర్ధాలని ఇస్తుంది. అలాగే వారి వ్యక్తిగత అనుభవాలు, జీవితానికి అన్వయించుకొని ఇతరులని పాయింట్ చేయడానికి ఇలాంటి ట్వీట్స్ పెడతారనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం సమంత కూడా చైతన్యని ఉద్దేశించే ఈ పోస్ట్ చేసిందని అందరూ భావిస్తున్నారు.