సమంత ఇప్పుడు ఏం చేసినా కూడా వైరల్ అవుతోంది. ఏం పోస్ట్ చేసినా లేదా పోస్ట్‌ను డిలీట్ చేసినా కూడా సమంత హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. గత రెండు రోజుల నుంచి సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకుంటున్నట్టు షేర్ చేసిన పోస్ట్‌ను సమంత ఇప్పుడు డిలీట్ చేసింది కాబట్టి సమంత చేసిన ఈ పనిపై కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మళ్లీ నాగ చైతన్య సమంత కాలిపోతున్నారా? అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాపైకి వచ్చాయి.
ఇక్కడేమో ఇలా సమంతకు సంబంధించిన వార్తలు వైరల్ అయి తెగ చక్కరలు కొడుతుంటే.. ఆమె మాత్రం స్విట్జర్లాండ్‌లో తేలిపోతోంది. అయితే సమంత స్విస్‌లో చేస్తోన్న అడ్వంచర్లకు సంబంధించిన వీడియో ఎంతగా సోషల్వై మీడియా లో తెగ వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. స్కింగ్ అనే ఈ ఆటలో సమంత ఆరితేరినట్టు కనిపిస్తోంది. మంచుతో కప్పుకుని ఉన్న ఈ రహదారుల్లో సమంత ఏ మాత్రం భయం లేకుండా అల అల దూసుకుపోయింది.
అయితే ఆ అడ్వంచర్ వెనుకున్న రహస్యం గురించి చెప్పింది సమంత. తనకు ట్రైనింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి తాజాగా చెప్పుకొచ్చింది సమంత. ఆ ఇద్దరే లేకపోతే బతికి ఉండేదాన్ని కాదన్నట్టుగా కూడా సమంత పేర్కొంది. నేను ఈ రోజు ఇలా ప్రాణాలతో బతికి ఉన్నానంటే దానికి ఈ ఇద్దరే కారణం అంటూ వారితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా లో సమంత షేర్ చేసింది.
మొత్తానికి సమంత మాత్రం ఇలాంటి అడ్వంచర్ల చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇది కేవలం తన సరదా కోసం చేస్తోందా? లేదా? ఏదైనా సినిమా కోసమాా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు రెడీగా ఉంది.