Samantha: తెలుగులో ‘ఏమాయ చేసావే’ అంటూ అందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. తమిళ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సమంత.. టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి, ఎక్కువ సినిమాలు హిట్ సాధించిన ఘనత కూడా ఒక్క సమంతకే చెల్లుతుంది.
టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు ఉన్న సమంత నటించిన సినిమాకు ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయి. సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ‘ యశోద’. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సమంతకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలలో కూడా పరిచయం ఉండటంతో అక్కడ కూడా సినిమాను విడుదల చేయడానికి రెడీ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్లలో సమంత పాల్గొనే పరిస్థితులు కనిపించడం లేదు. అనారోగ్య కారణాలతో సమంత ప్రమోషన్ కు దూరంగా ఉండే పరిస్థితులు ఉండగా.. యశోద టీం పూర్తిగా సమంత ప్రమోషన్ మీదనే ఆధారపడి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో మరింత ప్రమోషన్ ఈ సినిమాకు అవసరం కాగా.. సమంత మాత్రం దీనికి డుమ్మా కొట్టేలా ఉంది.
Samantha:
ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన యశోద సినిమా ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేయడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. పైగా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్లాన్ చేసి, ఇప్పుడు ప్రమోషన్ చేయకపోతే మాత్రం తప్పకుండా మైనస్ అవుతుందని నిర్మాతలు డైలమాలో పడ్డారట. కానీ సమంతను బలవంత పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకొని కూర్చున్నారట.