Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా నటన, సంబంధిత అంశాలపైనే ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే మొదట వృత్తి జీవితం హాయిగా ఉండాలని భావిస్తున్న సమంత.. ఇక సినిమాలు చేయడంలో నిమగ్నమైంది. సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
యశోద సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహించారు. యాక్షన్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. ఇందులో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. రిలీజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. దీని విడుదల తేదీని మూవీ మేకర్స్ వైవిధ్యంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ను తెలపడానికి అన్ని పిక్సెల్స్ ను అన్ బ్లాక్ చేయడానికి మేకర్స్ లింక్ ప్రొవైడ్ చేశారు.
మూవీని చూశాక థ్రిల్లింగ్ గ్యారెంటీ..
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది నవంబర్ 11న విడుదల కాబోతోంది. అంటే వచ్చే నెలలోనే. చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాస్త గ్యాప్ ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఈ చిత్రంలో మళ్లీ మనముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Samantha:
ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ చాన్నాళ్ల కిందటే రిలీజ్ చేశారు. అయితే, ఎలాంటి డైలాగ్స్ పెట్టకుండా కేవలం సమంత నటించిన గ్లింప్స్ మాత్రమే అందులో కనిపించింది. సినిమాపై ఉత్కంఠ పెంచేలా దాన్ని రూపొందించి రిలీజ్ చేశారు. సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా మణిశర్మ బాణీలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.