Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక పేరు సంపాదించుకోవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఉన్నఫలంగా సోషల్ మీడియాకు దూరం కావడంపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
సమంతకు ఆరోగ్యం బాగాలేదని అందుకే తాను పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా సమంత వేద పండితులతో కలిసి ఫోటో దిగడంతో ఈమె ఏదో ప్రత్యేక పూజలు పాల్గొన్నట్లు అర్థమవుతుంది.
ఈ విధంగా సమంత సికింద్రాబాద్ వేదశాలలో వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారని సమాచారం. ఈ క్రమంలోనే వేదశాలలో పండితులతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్ లు అసలు సమంత వేద పండితులను కలిసి ఎలాంటి పూజ చేయించారు. ఈమె పూజలు చేయించడం వెనుక ఉన్న కారణం ఏంటి అని పెద్ద ఎత్తున నెటిజన్ లు చర్చలు మొదలుపెట్టారు.
Samantha: కెరియర్ కోసమే పూజలు చేయించారా…
మరి సమంత ఇలాంటి పూజలు చేయించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఒక హిందీ వెబ్ సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే గుణశేఖర్ దర్శకత్వంలో ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది.