Samantha Ruth Prabhu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన తన చిత్రం శాకుంతలం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో, గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియోంటడ్ మూవీ శాకుంతలం. ఈ చిత్రం ఫిబ్రవరీ 17ను విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషనల్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మూవీ యూనిట్ మొత్తం హాజరయ్యింది. సామంత ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఈ పిక్స్ ను ఉద్దేశించి ఓ మేసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కు సమంత రీట్వీట్ ఇచ్చి తన ప్రేమను పంచింది.

సమంత తన అందాన్ని , మెరుపును కోల్పోయింది. ఆమె భర్త నుంచి విడాకుల తీసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చిందని అందరూ భావించినప్పటికీ , ఆమె వృత్తిపరమైన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ఎత్తులో నిలబడింది. ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక, ఆమెను మళ్లీ బలహీనపరచడానికి మైయోసైటిస్ వ్యాధి సామ్ ను తీవ్రంగా వేధిస్తోంది అని ఓ అభిమాన ట్విట్టర్ లో సామ్ పిక్ ను జోడిస్తూ ఓ పోస్ట్ ను పెట్టాడు. దీనికి రిప్లైగా సామ్ నేను తీసుకున్నట్లుగా మీరు నెలల తరబడి చికిత్సలతో పాటు మందులతో గడపకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ కాంతిని పెంచడానికి నా నుండి కొంత ప్రేమను పంపుతున్నాను అని తెలిపింది. దీంతో సామ్ ఈ ట్వీ్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాదు ట్రైలర్ లాంచ్ కు సామ్ జపమాలతో దర్శనమివ్వడంతో అందరూ అవాక్కయ్యారు. సామతం ఈవెంట్ జరుగుతున్నంత సేపు ఈ జపమాలతోనే ఉన్నారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం దేవ్‌నాగ్‌రీ షెల్ఫ్‌ల నుండి ఐవరీ చీరను ఎంచుకుంది సమంత. ఈ చీరలో నటి ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. తన భావోద్వేగాలను కవర్ చేసేందుకు ఆమె తన రూపాన్ని అద్దాలతో యాక్సెసరైజ్ చేసింది. చిత్ర ట్రైలర్ లాంచ్ నుండి భావోద్వేగంతో సమంతా రూత్ ప్రభు ఈ చిత్రాలను పంచుకుంది.

సమంతా రూత్ ప్రభు ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. దాని కోసం ఆమె సిరీస్‌లో స్యూసైడ్ మిషన్‌లో శ్రీలంక తమిళ విముక్తి పోరాట యోధురాలు రాజి పాత్రలో కనిపించి అభిమానులను అలరించింది. గత సంవత్సరం, ఈ నటి విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన కథువకుల రెండు కాదల్‌లో నటించింది. రీసెంట్ గా ఆమె యాక్షన్ థ్రిల్లర్ యశోదలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది .లేటెస్ట్ గా తాను నటించిన శాకుంతలం చిత్రం ప్రమోషన్ లో బిజీ గా ఉంది సామ్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17 న విడుదల చేయనున్నట్లు తన ఇన్‌స్టాలో వెల్లడించింది. సమంతా రూత్ ప్రభు త్వరలో డోన్టన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో కలిసి అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్‌లో పని చేయనుంది.
Advertisement