Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు సినిమాల విషయంలో స్పీడును పెంచేసింది. ఓవైపు అనారోగ్య సమస్య వేధిస్తున్నా ఏమాత్రం పట్టువదలకుండా తన ఫిట్‌నెస్‌ను మెయిన్‌టైన్ చేస్తూనే సైన్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ పనులను మళ్లీ స్టార్ట్ చేసింది. ఈ మధ్యనే సామ్, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ఖుషీ మూవీ షూట్ త్వరలో ప్రారంభంకాబోతోందని డైరెక్టర్ స్వీట్ న్యూస్ చెప్పాడు. తాజాగా సామంత సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్‌లో తాను నటిస్తున్న సిటాడెల్ లుక్ ను రిలీజ్ చేసింది. సీటాడెల్ లో తన లుక్‌కు సంబంధించిన ఫస్ట్ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అమ్మడి స్టైల్ అదుర్స్ అంటూ అభిమానులు సామ్ ని చూసి ఈలలు వేస్తున్నారు. ఇంతలోనే అంత చేంజా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి నటించబోయే గూఢచర్యం సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన లుక్‌ను సామంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో కోసం రస్సో సోదరుల AGBO ద్వారా సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సిటాడల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో వరుణ్ ధావన్‌తో కలిసి సామ్ షూటింగ్‌లో పాల్గొంటోంది. సీటాడెల్ స్పై ఇండియన్ సీరీస్ ను చిత్రనిర్మాతలు రాజ్ నిడిమోరు , కృష్ణ డికె లు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ వీడియోలో ఈ సీరీస్‌ను విడుదల చేయనున్నారు. సిటాడెల్‌తో, వరుణ్ తొలిసారి ఒటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నాడు. సమంత గతంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2లో దర్శకుడు రాజ్ , డికెతో కలిసి పనిచేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫస్ట్ లుక్ పిక్‌ను పోస్ట్ చేసి మిషన్ ఆన్‌లో ఉంది అని ఫైర్ ఏమోజీని పోస్ట్ చేసి, మేము ఇండియన్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ సిటాడెల్ కోసం యాక్షన్ ప్రారంభించాము అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ అవతార్ లో సమంత అదుర్స్ అంటున్నారు అభిమానులు. లోయర్, లెదర్ జాకెట్, బ్లాక్ ప్యాంట్ ధరించి కత్తిలా ఉంది ఈ బ్యూటీ. ఆమె సన్ గ్లాసెస్‌తో తన రూపాన్ని పూర్తి చేసి తన క్యారెక్ట్రర్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది ఈ చిన్నది.

సమంత అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇకపై సిటాడెల్‌లో భాగం కాబోదు అంటూ సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. గత సంవత్సరం, సమంత తనకు మయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారించడంతో ఈ గాసిప్స్ మరీ ఎక్కువయ్యాయి. అయితే అప్పట్లో స్పందించని సమంత ప్రసత్తుం తన లుక్ తో సిటాడెల్ నుండి తాను తప్పుకోవడం లేదు అన్న స్పష్టం చేసింది. పుకార్లను షట్‌డౌన్ చేసింది.

సమంత తదుపరి చిత్రం శాకుంతలం, ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. కాళిదాసు ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞానం శాకుంతలం ఆధారంగా, దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ దృష్యకావ్యంలో సమంత శకుంతలగా కనిపిస్తోంది. నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రను పోషించాడు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండతో కలిసి సమంత రొమాంటిక్ డ్రామా ఖుషీలో కనిపించనుంది.