Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం చిత్రం విడుదల తేదీ ఖరారు అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న బిగ్ స్క్రీన్ లోకి రానుంది. ముందుగా నవంబర్ 4, 2022న విడుదల అవుతుందని అందరు భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ డేట్
ను పోస్ట్ పోన్ చేసారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు పెద్దమొత్తంలో రిలీజ్ కు రెడీ గా ఉండటంతో ఫిబ్రవరి 17, 2023న మూవీ విడుదల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గుణశేఖర్. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని 3Dలో చూసి అనుభూతి పొందవచ్చు. మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన వివరాలను సామ్ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసింది. “Witness the #EpicLoveStory #Shaakuntalam in theatres from Feb 17th 2023 Worldwide! Also in 3D,” అని ఓ పిక్ ను పోస్ట్ చేసి తన ట్విట్టర్లో కాప్షన్ ను జోడించింది.

కాళిదాసు ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం “అభిజ్ఞాన శాకుంతలం” ఆధారంగా, ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గుణశేఖర్ రచన మరియు దర్శకత్వం వహించారు. విచిత్రమైన కథగా పేర్కొనబడిన “శాకుంతలం” చిత్రం శకుంతల ,రాజు దుష్యంత్‌ల పురాణ ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం లో సమంత కు జోడిగా దుష్యంతునిగా సుఫియుం సుజాతయుం ఫేమ్ మలయాళం నటుడు దేవ్ మోహన్ నటించాడు.

గుణ టీమ్‌వర్క్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మించారు. సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డాక్టర్ ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్లా తదితరులు నటించారు. శాకుంతలం, హిందీ, తమిళం, మలయాళం కన్నడ భాషలలో కూడా విడుదల కానుంది.

డైరెక్టర్ గుణశేఖర్ కు ఇండస్ట్రీ లో మంచి ఇమేజ్ ఉంది. ఎన్నో సినిమాలను అత్యద్భుతంగా తీసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా అవార్డులను సొంతం చేసుకున్నారు. పౌరాణిక చిత్రం శాకుంతలంతో మరోసారి తెర మీద మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అయ్యారు. యశోద హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సామ్ , శకుంతలాగా మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేందుకు రెడీ అయ్యింది.
