Samantha : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సౌత్ బ్యూటీలలో సమంత ఒకరు. ఎప్పటికప్పుడు సామ్ తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ అప్డేట్స్ లను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది రీసెంట్ గా సమంత మయోసైటీస్ తో బాధపడుతుందని తెలిసినప్పటి నుంచి సినీ ప్రముఖులందరూ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అంతటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సమంత యశోద మూవీతో ప్రేక్షకులకు అలరించింది.

సమాజంతోనే కాదు తనతో తానే పోరాడుతూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది సామ్. తాజాగా సమంత ఫ్రెండ్ ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సామ్ కు ఓ మంచి ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చారు. శక్తివంతమైన మెసేజ్ తో వచ్చిన ఆ ఫోటోను సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పిక్ నెట్ లో తెగు వైరల్ అవుతుంది. ఈ పిక్ చూసిన ఫాలోవర్స్ ఒక్కో రకంగా మెసేజ్ చేస్తున్నారు.

సామ్ నువ్వు ఐరన్ లేడీ అంటూ రాహుల్ రవీంద్ర ఒక అద్భుతమైన మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. నీ చుట్టంతా చీకటి ఉండొచ్చు కానీ అది శాశ్వతంగా నిలిచిపోదని త్వరలోనే ప్రకాశిస్తుందని, నీ అడుగు పడటానికి ప్రస్తుతం కష్టంగా ఉండొచ్చు కానీ త్వరలోనే అన్ని బాగుంటాయని ఎందుకంటే నువ్వు ఐరన్ లేడీవి. నీ పాదం ఎప్పటికీ ఆగదని నువ్వు ఒక ఫైటర్ అని అన్నాడు . ఇలాంటి కష్టతర పరిస్థితులే నిన్ను ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తాయని అది తనకు తెలుసునని నువ్వు ఎప్పటికీ ఇలాగే బలంగా ఉండాలి అని సామ్ కు పవర్ ఫుల్ మెసేజ్ ను ఒక పిక్ జోడించి గిఫ్ట్ గా ఇచ్చారు రాహుల్.

సామ్ ఈ పిక్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రాహుల్ కి మంచి రిప్లై ఇచ్చింది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి వాటి నుంచి పోరాడుతున్న వారికి ఈ మెసేజ్ అంకితమని రిప్లై ఇచ్చింది సామ్.