సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నంలో ఉంది. ఆ దిశగా తాను అడుగులు వేస్తుంది. సౌత్ లో ఇంకా ఎలాగూ ఆమె స్టార్ హీరోయిన్ శకం ముగిసిపోయే దశకి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖుషి, శాకుంతలం, యశోద సినిమాలు ఉన్నాయి. ఈ మూడు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం వీటి సక్సెస్ తర్వాత సౌత్ లో నుంచి ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు. బాలీవుడ్ లో ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాబెల్ రీమేక్ లో నటించబోతుంది. ఇదిలా ఉంటే సమంత చాలా కాలంగా సోషల్ మీడియాలో దూరంగా ఉంది.
గతంలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అయితే గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ అప్డేట్స్ అయితే సమంత నుంచి రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె మీద రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఆ రూమర్స్ లో వాస్తవం లేదని సమంత మేనేజర్ ఖండించారు. కానీ ఆమె మాత్రం వాటిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా సమంత సికింద్రాబాద్ లో ఓ వేద పాఠశాలలో ఆమె ప్రత్యక్షమైంది. దీనికి సంబందించిన ఫోటోలు బయటకి వచ్చాయి. ఆ వేద పాఠశాలలో, ఋత్విక్కుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిందని టాక్.
ఈ పూజ కార్యక్రమాలు పండితులు, వేద పాఠశాల విద్యార్థుల సమక్షంలో జరిగిందని సమాచారం. చాలా సీక్రెట్ లో దీనిని నిర్వహించారని తెలుస్తుంది. అయితే ఈ పూజా కార్యక్రమాలలో సమంత చాలా క్యాజువల్ డ్రెస్సులో, కుర్చీ మీద కూర్చొని ఉన్న ఫోటో బయటకి వచ్చింది. అలాగే పేస్ కి మాస్క్ కూడా పెట్టుకోవడం విశేషం. అయితే కేవలం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి పేస్ మాస్క్ పెట్టుకుందా లేదంటే ఏమైనా అనారోగ్యంతో ఉందా అనే విషయాలు తెలియరాలేదు. ఆమె ఫోటోలు చూస్తుంటే మాత్రం ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు అర్ధమవుతుందని కొందరు అంటున్నారు.