యశోద సినిమాతో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ సూపర్ టాక్ తో ఇప్పటికి థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. లాంగ్ రన్ లో సినిమా 50 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని దర్శకద్వయం హరి హరీష్ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ ని కూడా సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. సమంత నిర్ణయం కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే మాయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటం వలన సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయింది. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయిన సమంత అనే బ్రాండ్ తోనే యశోద సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
నాగ చైతన్య థాంక్యూ సినిమాకంటే ఎక్కువ ఓపెనింగ్స్ యశోద మూవీకి రావడం విశేషం. ఇక ఇంత భారీ హిట్ కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రేక్షకులకి థాంక్స్ చెబుతూ ట్విట్టర్ లో ఆమె ఓపెన్ లెటర్ పెట్టింది. యశోద సినిమాతో తనకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి ధన్యవాదాలు అని చెప్పింది. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నా. ఇది నాకు లభించిన గొప్ప బహుమతి.
యశోద చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి చూస్తున్న. ఇప్పుడు నా మనస్సు గాల్లో తేలుతున్నట్లు ఉంది. ఈ సినిమా కోసం మా టీం మొత్తం అహర్నిశలు శ్రమించారు. ఈ ప్రాజెక్ట్ కి పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్న. అలాగే నాపై, ఈ కథపై నమ్మకం ఉంచి ముందుకొచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు తెలియజేస్తున్న. అలాగే ఎంతో రీసెర్చ్ చేసి ఇంత గొప్ప సినిమాని తనకి ఇచ్చిన దర్శకులు హరి, హరీష్ తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని ఓపెన్ లెటర్ లో సమంత పేర్కొనడం విశేషం. ఇప్పుడు ఈ లెటర్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.