శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ఖుషి. పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ ఖుషి టైటిల్ తో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా నుంచి వదిలిన స్టిల్స్ కూడా సినిమాపై ఇంటెన్సిటీని పెంచాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని దర్శకుడు శివ నిర్వాణ కంప్లీట్ చేశాడు. శివ నిర్వాణ చివరి చిత్రం టక్ జగదీష్ ఏవరేజ్ టాక్ తో నడిచింది. దీంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఖుషి సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కుస్తున్నాడు. ఇక లైగర్ సినిమా రిలీజ్ హడావిడి కారణంగా విజయ్ దేవరకొండ ఈ మూడు నెలల పాటు షూటింగ్ లో పాల్గొనలేదు.
ఇక సమంత కూడా శాకుంతలం, యశోద మీద ఆ సమయంలో ఫోకస్ పెట్టింది. ఇక విజయ్ అందుబాటులో ఉండటంతో దర్శకుడు శివ ఖుషి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో అతనికి సమంత నుంచి సహకారం అందడం లేదని తెలుస్తుంది. ఇప్పట్లో సినిమా షూటింగ్ లో పాల్గొనలేనని దర్శకుడికి సమంత స్పష్టం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో ఆమె కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలు తప్ప మిగిలిన వి షూట్ చేయడానికి దర్శకుడు శివ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. చైతూతో విడాకుల తర్వాత సమంత బాగా డిస్టర్బ్ అయ్యిందని, సోషల్ మీడియాలో తనపై జరిగిన ప్రచారంపై కొంత ఆవేధనకి గురైనట్లు టాక్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతకాలం మానసిక ప్రశాంతత కోసం ఆమె అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఖుషి షూటింగ్ కి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.