Samantha: తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ సమంత. ‘ఏమాయ చేసావే’ అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. ఇప్పుడు తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తే సమంత బిజీబిజీగా గడుపుతోంది. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది.
ఇప్పుడు సౌత్ ఇండియా నుండి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార, రష్మికల జాబితాలో సమంత చేరడం అందరిలో చర్చకు దారి తీసింది. తమిళ లేడీ సూపర్ స్టార్ గా ఉన్న నయనతార అంతకుముందు మూడు, నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. ఒక తమిళ సినిమాకి ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది.
కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన రష్మిక మందన్నా కూడా ఇప్పుడు ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని, నయనతో కలిసి టాప్ లో ఉంది. పుష్ప2లో కూడా నటిస్తున్న రష్మిక.. ఆ సినిమా హిట్ అయితే తన రెమ్యునరేషన్ ని మరింత పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Samantha:
ఇప్పుడు సమంత కూడా ఈ జాబితాలో చేరింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు మూడు కోట్లు కాస్త అటుఇటుగా రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న సమంత.. దానిని అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈమె ఐదు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తన చేతిలో ఉన్న యశోధ, ఖుషి, శాకుంతలం సినిమాలను చూపుతూ.. తర్వాతి ప్రాజెక్టులకు భారీగా రెమ్యునరేషన్ అడుగుతోందట.