Samantha: తన నటనతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలదొక్కుకున్న నటి సమంత. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ నటి.. ఇటీవల అరుదైన జబ్బుతో బాధపడుతున్నానని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నాగచైతన్యతో పెళ్లి, తర్వాత విడాకులతో ఎన్నో అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న సమంత.. అంతే దృఢంగా కెరీర్ లో నిలదొక్కుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇటీవల ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాను మయసైటిస్ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నానని తెలిపింది. ఈ ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమంత త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కోరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, అక్కినేని అఖిల్ తదితరులు సమంత కోలుకోవాలని ట్వీట్ల ద్వారా తెలిపారు.
డియర్ సామ్.. కాలానుగుణంగా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.. వాటి వల్ల మనలోని శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోగలుగుతామని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా తెలిపారు. అతి త్వరలో సమస్యను అధిగమించాలని చిరు ఆకాంక్షించారు. సమంతకు అలాంటి ధైర్యం, నమ్మకం కలగాలని మెగాస్టార్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక సమంత ఇన్ స్టాలో పోస్టు పెట్టాక ఫ్యాన్స్ సైతం కామెంట్ల వర్షం కురిపించారు. గుండె ధైర్యంతో ఆపదను ఎదుర్కొనాలని సూచించారు.
Samantha: మెగా బ్రదర్ నాగబాబు స్పందన ఇదీ..
మరోవైపు మెగాస్టార్ తమ్ముడు నాగబాబు సమంత ఆరోగ్యంపై స్పందించారు. నేటి వరకు తనకు తెలిసిన దృఢమైన వ్యక్తుల్లో సమంత ఒకరని పేర్కొన్న నాగబాబు.. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సమంతతో నేరుగా ఏనాడూ మాట్లాడకున్నా ఆమె మయోసైటిస్ తో బాధపడుతోందని తెలిసి నా గుండె ద్రవించిందన్నారు నాగబాబు. ఈ అంశం తనను తీవ్రంగా కలచి వేస్తోందన్నారు. మునుపటికంటే మరింత దృఢంగా ఆమె తిరిగి కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా నాగబాబు తెలిపారు.
To Samantha @Samanthaprabhu2 ,
One of the Strongest Human i ever Known. pic.twitter.com/uAT8CDcgEL
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 30, 2022