సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ఆమె ఇమేజ్ బాలీవుడ్ కి కూడా విస్తరించింది. ఈ నేపధ్యంలోనే ఇప్పటికే బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాక హిందీ మూవీ చేయాలని సమంత భావించింది. ఇక యశోద సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టం మరోసారి పరీక్షించుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నిర్మాతకి భారీ లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక యశోద షూటింగ్ పూర్తయిన తర్వాత నుంచి సమంత మయోసైటిస్ తో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండీషన్ అయితే ప్రస్తుతం ఏమీ బాగోలేదు. కనీసం నిలబడలేని స్థితిలో ఉంది. అయితే యశోద హిట్ తో మానసికంగా సమంత మరింత స్ట్రాంగ్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అవుతుంది. తన ఆలోచనలని డైవర్ట్ చేసుకునే పనిలో ఉంది. ఇక పెద్దగా సమంత హడావిడి లేకపోయిన గత మూడు నెలల నుంచి ఇండియన్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో ఆమె మొదటి స్థానంలోనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది సమంత గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఆమె కొనసాగుతుంది. ఇక సమంత తర్వాత స్థానంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఉండటం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా లేనంత పాపులారిటీ సమంతకి ప్రస్తుతం ఉందని చెప్పడానికి ఈ సర్వే ఒక ఉదాహరణ అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయిన ఆమె గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తుంది. ఆమె చేసిన యశోద సినిమాతో పాటు, ఆమె హెల్త్ కండిషన్ కి సంబందించిన అప్డేట్స్ ని తెలుసుకోవడానికి ఇండియన్ వైడ్ గా సమంత ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా కొనసాగుతుంది.