Samantha: అగ్ర కథానాయిక సమంత నటించిన తాజా చిత్రం యశోద. నవంబర్ 11న విడుదలవుతోంది. అయితే, ఈ మూవీ బిజినెస్ పై ట్రేడ్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరోగసీ నేపథ్యంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే యశోద. హరీ, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో విడుదలవుతోంది.
తాజాగా సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారం జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే యశోద ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. మరోవైపు తాను మయోసైటిస్ అనే అరుదైన జబ్బు బారిన పడ్డానని సమంత చెప్పిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొన్నాళ్లు ప్రమోషన్ కు దూరంగా ఉన్నానని తెలిపింది. తాజాగా సమంతతో ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ యాంకర్ సుమ.. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఎమోషనల్ అవుతున్న దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అయితే, యశోద మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూ వదిలారనే టాక్ వస్తోంది. మూవీకి ఆశించినంత హైప్ లేకపోవడంతో సమంత స్టార్ డమ్ మాత్రమే సినిమాను రక్షిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Samantha: ప్రీ బిజినెస్ లోనే లాభాలు?
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అయిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.. కేవలం సమంతపైనే హోప్స్ పెట్టుకొని భారీ పెట్టుబడి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 40 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి అయినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, నిర్మాత సుమారు 15 కోట్లు ఎక్కువ చేసి చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ, తెలంగాణలో సుమారు 10 కోట్లకు సినిమాను అమ్మారని తెలుస్తోంది. ఓవర్సీస్ కోటిన్నర, డిజిటల్ రైట్స్ మరో 20 కోట్లు కలుపుకొని సుమారు 30 కోట్ల వరకు ప్రీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇతర భాషల హక్కులూ కలుపుకుంటే ఇప్పటికే నిర్మాత లాభపడ్డారని టాక్ నడుస్తోంది.