కెరియర్ లో తొలిసారి పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించిన సామ్ హరి – హరీష్ దర్శకత్వంలో యశోద మూవీ చేస్తుంది.ఈ మూవీలో సమంత నర్స్ పాత్రలో కనిపించబోతుంది.కొత్త తరం థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తయ్యింది.మరో వారంలో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.
ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించి కనువిందు చేయనున్నారు.ఈ మూవీని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించనున్నారు.చైతూతో డైవర్స్ తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టిన సామ్ ప్రస్తుతం వరసగా మూవీలు చేస్తూ బాగా బిజీగా ఉంది.సామ్ ఈ మూవీ కాకుండా మరో బైలింగ్వల్,ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తుంది.