విజయ్ దేవరకొండ మరియు సమంతలు జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.. ఈ సినిమా త్వరలోనే విడుదల కు సిద్ధమైంది . డైరెక్టర్ శివ నిర్వాణ నుంచి వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందించడానికి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్ మరియు పోస్టర్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి . ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.

ఈ తరుణంలో మయోసైటిస్ ఇండియా ఆర్గనైజేషన్ కు హీరోయిన్ సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు ఆ సంస్థ వాళ్ళు వెల్లడించారు . మయోసైటీస్ తో బాధపడుతున్న వారికి ధైర్యం అందించేందుకు మరియు ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకుగాను సమంత…తమతో కలిసి పనిచేస్తారని ఆర్గనైజేషన్పే వాళ్ళు పేర్కొన్నారు . కాగా, సమంత గత కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.