Samantha: తెలుగులో హీరోలకు సమానమైన క్రేజ్ ను, ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. ‘ఏమాయ చేసావె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత.. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసింది. హీరోలకు సమానమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సమంత.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం సమంత పలు ప్రాజెక్టులపై పని చేస్తుండగా.. అందులో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా ‘యశోద’. సరోగసీ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ‘యశోద’ సినిమా తెరకెక్కగా.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో పలు యాక్షన్ సీన్లు సినిమాకు ప్లస్ అవుతాయట.
సరోగసీ మాఫియా మీద పోరాటం చేసే యువతిగా సమంత ఈ సినిమాలో కనిపిస్తుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్లు.. అభిమానులు సీట్లకు అతుక్కుపోయేలా ఉంటాయని టాక్ ఉంది. ఈ సినిమాలో సమంతని ఛేజ్ చేసే డాగ్ సీన్ ఒకటి ఎంతో ఉత్కంఠంగా సాగుతుందని ఇండస్ట్రీలో టాక్.
Samantha:
డాగ్ సీన్ లో వెంటపడిన కుక్క నుండి తప్పించుకోవడానికి సమంత పరుగెత్తుకుంటూ.. కొండ అంచుల వరకు వెళ్లి ఆగిపోవడం థ్రిల్లింగ్ గా అనిపిస్తుందట. ఈ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని.. ఇందుకోసం కృూరమైన చిప్పిపరై అనే జాతి కుక్కను తీసుకువచ్చారని తెలుస్తుండగా.. ఈ సీన్ ను కొడైకెనాల్ లో షూట్ చేశారట. మరి ఈ సీన్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.