Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న వారిలో నటి సమంత ఒకరు. ఇలా దశాబ్దన్నర కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకొని విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈమె హరి హరీష్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ చిత్రమైన యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు నెలలోనే విడుదల కాబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదల మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి సమంతనే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఇంకా ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ఉందని అయితే ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.
సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాగా వస్తున్నటువంటి యశోదలో సినిమాలు ఈమె భారీ యాక్షన్స్ సన్ని వేషాలలో నటించారు.ఇలా యాక్షన్స్ సన్ని వేషాలలో నటించడం వల్ల ఈమె తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని తద్వారా అనారోగ్య సమస్యలతో బాధపడటం వల్లే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Samantha: భారీ వర్కౌట్స్ చేయడమే కారణమా…
సమంత ఈ సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలలో నటించడం కోసం పెద్ద ఎత్తున కసరతులు చేయడమే కాకుండా ఈ సినిమా కోసం భారీగా శ్రమించడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయాని ఈ సమస్యలతో సమంత బాధపడుతున్నారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా కోసం సమంత ఎలా హార్డ్ వర్క్ చేశారో మనకు అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయని చెప్పాలి.