Samantha: ఏంటో ఈ మధ్య సమంతది ఏ వార్త వచ్చినా తెగ వైరల్ అవుతుంది. నిజానికి తను నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే.. వీరిద్దరి గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. మామూలుగా ఏ ఇతర సెలబ్రెటీలైన విడాకులు తీసుకుంటే మహా అయితే జనాలు వారి గురించి రెండు లేదా మూడు నెలల వరకు మాట్లాడుకుంటారు.
కానీ సమంత, నాగచైతన్య గురించి మాత్రం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మాట్లాడుకునేలా చేసుకున్నారు ఈ జంట. ఇక ఇదంతా పక్కన పెడితే.. సమంతకు ఏం జరిగిందో తెలియదు కానీ.. అందరిని దూరం చేసుకుంటుంది. తాజాగా తన తల్లిని కూడా దూరం చేసుకుంది అని తెలుస్తుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సొంతంగా ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంత. తన నటనతో మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. ఇక తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.
ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు. పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. బిజినెస్ లు కూడా ప్రారంభించింది.
పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది. బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది. అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.
Samantha:
ఆ తర్వాత తన తల్లితో కలిసి ఉంటుంది సమంత. అయితే తాజాగా సమంత తల్లిని కూడా దూరం చేసుకుందట. సమంత లేట్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ తో వస్తుందని తన తల్లి హెచ్చరించిందట. అయినా కూడా సమంత అలా చేయడంతో ఈసారీ తన తల్లి సమంత మీద చెయ్యి చేసుకోబోయిందట.. దీంతో సమంత తిరిగి తన తల్లిపై ఫైర్ అవుతూ.. తన ఫ్రెండ్స్ అందరి ముందు.. నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నదని.. దీంతో ఆ మాటలకు సమంత తల్లి గుండె పగిలి ఆ ఇంటి నుండి సమంతకు దూరంగా వెళ్ళింది అని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది.