Samantha : గత కొంతకాలంగా సౌత్ టాప్ హీరోయిన్ సమంత ఆరోగ్యం పై అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. సమంత ది సెకండ్ స్టేజ్ అని థర్డ్ స్టేజ్ అని అసలు ఆరోగ్యం బాలేదని సీరియస్ కండిషన్లో ఉందంటూ నానా రభస చేస్తున్నాయి. ఇక దొరికిందే ఛాన్స్ కావడంతో ఒక్కొక్కరు ఒక్కోలా కొత్త కథను అల్లేస్తున్నారు. ఇక రెండు రోజులుగా సోషల్ మీడియాలో సమంత విదేశాలకు వెళ్లిందని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటోందని కండిషన్ సీరియస్ గా ఉందంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా తాజాగా సామ్ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తన ఆరోగ్యం పై ఒక క్లారిటీ ఇచ్చేసింది.

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంతను సోషల్ మీడియాలో చాలా రకాలుగా ట్రోలింగ్ చేశారు. పర్సనల్ విషయాల్లో సైతం లేనిపోని పుకార్లను పుట్టించాయి. తన మనోవేదనను తెలిపినా, యాక్టివ్ గా ఉన్నా వేరే హీరోతో డాన్స్ చేసినా, ఏం మాట్లాడినా అందులో తప్పు వెతకడమే పనిగా పెట్టుకున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్ లు, వెబ్ సైట్స్. కొంతకాలం నెట్టింటికి కూడా చాలా దూరంగా ఉంటూ వచ్చింది సామ్. ఇక ఈ ట్రోలర్ల నోటికి తాళం వేసేలా రీసెంట్ గా తన మూవీ యశోద ప్రమోషన్స్ సందర్భంగా విడుదల అయిన వీడియోలో తన అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది. దీంతో అన్ని రూమర్స్ కు ఒక్కసారిగా బ్రేక్ వేసింది.

సామ్ వయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. అందుకే చాలా వరకు షూటింగ్ల ను పోస్ట్ పోన్ చేసి ఇంట్లోనే తన ఆరోగ్యం పై కాన్సెంట్రేట్ చేసింది. త్వరగా కోలుకొని షూటింగ్లకు పాల్గొనాలని చూస్తోంది. ఇంతలోనే మళ్లీ ఏమైందో ఏంటో సమంత సీరియస్ అని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లిందని ట్రోలర్లు మళ్ళీ వైరల్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. వీటికి బ్రేక్ వేస్తూ సమంత అడవి శేషు నటించిన హిట్ 2 మూవీకి సంబంధించి ట్విట్టర్ పోస్టు పెట్టింది. ఈ పోస్టులో కంగ్రాజులేషన్ ఆన్ యువర్ సూపర్ హిట్ అని ఎమోజిలు పెట్టి అడవి శేషు కు కంగ్రాజులేషన్ చెప్పింది. దీంతో గత రెండు రోజులుగా సమంత ఆరోగ్యం పై కంగారు పడ్డ ఫ్యాన్స్ ఊపిరి పిలుచుకున్నట్లు అయ్యింది. సమంతా సేఫ్ గా ఉందని ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
