Samantha తెలుగు జనాలకు బాగా దగ్గరైన హీరోయిన్లలో టాప్ లో హీరోయిన్ సమంత ఉంటుంది. ‘ఏమాయ చేసావె’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. హీరోలకు ధీటుగా చరిష్మాను, స్టార్ డంను సొంతం చేసుకుంది. తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరిగేలా చేసింది కూడా సమంతనే. కథల విషయంలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ, నటన పరంగా ఎంతో పరిణతిని కనబరుస్తూ.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సమంత ఆకట్టుకుంటూనే ఉంది.
తాజాగా తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమంత వెల్లడించింది. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సమంతకు వచ్చిన వ్యాధి కారణంగా ఆమె అస్సలు బయటకు రావడం లేదు. షూటింగ్ అన్ని నిలిపివేసింది. ప్రెస్ మీట్ లు కూడా లేవు. అన్నింటికి మించి తనకు వ్యాధి వచ్చిందనే అప్ డేట్ తర్వాత సోషల్ మీడియాలో కూడా సమంత యాక్టివ్ గా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఎలా ఉందో అనే ప్రశ్న తలెత్తింది.
సమంతకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మయోసైటిస్ వ్యాధి సోకిన తర్వాత సమంత ఎలా ఉంది అనే ప్రశ్నలకు ఈ ఫోటోలు సమాధానాలు ఇస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో, బ్లాక్ కలర్ అద్దాలు పెట్టుకొని.. సమంత సోఫాలో కూర్చొని పోజిచ్చింది. ఈ ఫోటోను చూసిన జనాలు.. సమంత మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు.
Samantha
ఈనెల 11న సమంత నటించిన ‘యశోద’ సినిమా రిలీజ్ కానుండగా.. ఈ సినిమా గురించి ఓ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పోస్ట్ లో సమంత ఇలా రాసుకొచ్చింది.. ‘నా మంచి స్నేహితుడు రాజ్ & డీకే చెప్పినట్లుగా.. రోజు ఎలా ఉన్నా ఎంత చెత్తగా ఉన్నా షేవ్ చేసుకొని షవర్ చేసి చూపించు అనేది అతని నినాదం. ‘యశోద’ మూవీ ప్రమోషన్స్ కోసం నేను ఒక రోజు దాన్ని అప్పు తీసుకున్నాను. ఈ 11న కలుద్దాం’.