Samantha Comments: అక్కినేని నాగచైతన్య, సమంతల జంట విడిపోయి ఏడాది దాటినా వారి గురించి గాసిప్పులు మాత్రం ఇంకా ఆగలేదు. రోజుకో, వారానికో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటోంది. పెళ్లికి ముందుకంటే పెళ్లయ్యాకే వీరి గురించి జనాలు ఎక్కువ మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి విడాకుల విషయం అంతలా హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో.
చూడచక్కని జంటగా, కలర్ ఫుల్ కపుల్స్ గా అనేక చిత్రాల్లో కలిసి నటించారు. తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇంత అందమైన జంట విడిపోవడానికి కారణాలేమైనప్పటికీ ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం తెగ బాధపడ్డారు. మళ్లీ వీరిద్దరూ జీవితంలో కలిసి నడవాలని ఎంతో మంది నేటికీ ఆకాంక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు.
గతంలో సమంత తన ఫ్రెండ్స్ వద్ద చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాగచైతన్యతో విడాకులు కాకమునుపు కొంత కాలం వేర్వేరుగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు స్నేహితులు సమంత వద్దకు వచ్చారు. అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీని వదులుకోవద్దని ఆమె ఫ్రెండ్స్ చెప్పారట. ఓ సారి మీ మామయ్య నాగార్జునతో మాట్లాడి మీ ఇద్దరి గొడవల గురించి చెప్పి సర్దుకు పోవాలని సూచించారట.
Samantha Comments:
అయితే, సమంత భిన్నంగా స్పందించినట్లు తెలిసింది. వారికి కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పిందట. అంవేంటంటే… ఆయనే (నాగచైతన్య) పెళ్లాం చాటు మొగుడు.. భార్య చెప్పింది తప్ప మరెవరి మాటా వినడు.. అంటూ కామెంట్లు చేసిందట. ఈ మాటలు విన్నాక అవాక్కవడం సమంత ఫ్రెండ్స్ వంతైంది.