Samantha: రామ్‌చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం రంగస్థలం. అంతవరకు మాస్ హీరోగా ఉన్న ఈ హీరోలోని పరిపూర్ణ నటుడ్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సినిమా. ఇది రామ్‌చరణ్ కెరీర్‌లోనే కాకుండా దర్శకుడు సుకుమార్, హీరోయిన్ సమంత కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత బదులు వేరే హీరోయిన్‌ను అనుకున్నారంటా. మరి ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
నాలుగేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డులన్నింటిని తిరగరాసాడు. ఈ సినిమాతో అప్పటి వరకు చరణ్ నటనపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంతో రామ్‌చరణ్ తన కెరీర్‌లో రూ.125 కోట్ల మార్క్ అందుకోవడమే కాకుండా యూఎస్‌లో కూడా తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా సమంత నటించింది. సమంత పల్లెటూరి అమ్మాయిగా చక్కగా ఒదిగిపోయింది. రామ్‌చరణ్‌తో దీటుగా నిటించిన సమంత నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా రంగస్థలం సినిమా విషయలో సమంత ఎంపికపై నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో మొదటగా సమంత బదులు వేరే హీరోయిన్‌ను అనుకున్నారంట సుకుమార్. ముందుగా కీర్తిసురేష్ అయితే ఈ పాత్రకు సరిపోతుందని ఆమెను ఫిక్స్ చేద్దామనుకున్నారంట. దీనికోసమే ఆమె సంప్రదించడం కూడా జరిగిందంట. అయితే అప్పటికే ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ఖాళీ లేక ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు తెలుస్తుంది.
Samantha:
ఆమె కనుక ఈ సినిమాలో నటించి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని, ఆమె కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులను సంపాదించుకునేదని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా ఆమె ఈ పాత్ర వదులుకొని తప్పు చేసిందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే సమంత ఈ అవకాశాన్ని దక్కించుకొని భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.