Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఆమె అభిమానులు తడుముకోకుండా ఇచ్చే ఆన్సర్.. చిన్మయి శ్రీపాద.సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చిన్మయి ఫేమస్. అంతేకాకుండా.. సామ్‌కు చిన్మయి గొంతు అద్భుతంగా సెట్ అవుతుంది. దీంతో దాదాపు సామ్ సినిమాలన్నింటికీ చిన్మయినే డబ్బింగ్ చెబుతుంది. సామ్ తొలి సినిమా నుంచి వీరిద్దరి ట్రావెల్ ప్రారంభమైంది.దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది.
మీకు గుర్తుండే ఉంటుంది.. సమంత, నాగ చైతన్యల వివాహానికి ఇండస్ట్రీ నుంచి ఎవరికీ ఆహ్వానం లేదు ఒక్క చిన్మయి కుటుంబానికి తప్ప. అంత క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట సమంతకు. కానీ ఈ మధ్య వీరిద్దరికీ చెడిందనే టాక్ బాగా వినిపిస్తోంది. అమ్మడు తొలుత చైతుకి ఆ తర్వాత చిన్మయికి కూడా బ్రేకప్ చెప్పేసిందట. అసలు ఈ టాక్ ఎందుకు వచ్చిందంటే.. ప్రస్తుతం సామ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ.. ‘యశోద’. ఈ మూవీకి చిన్మయి డబ్బింగ్ చెప్పటం లేదట. సమంతే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోందట.
ఈ విషయం బయటకు వచ్చీ రావటంతోనే పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. సమంతకు, చిన్నయికి మధ్య చెడిందని, సైలెంట్‌గా చిన్మయికి కూడా బ్రేకప్ చెప్పేసిందని.. వీరి మధ్య మనస్పర్దల కారణంగా చిన్మయిని సమంత పక్కన పెట్టేసి తన తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలపై సమంత కానీ చిన్మయి కానీ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.ఇక యశోద మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.హరి – హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.