ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య ఎవరూ ఊహించని రీతిలో రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నారు. కరోనాకి ముందు వరకు ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్లు ఉండేవారు. భార్యాభర్తలు అంటే సామ్-చైతూలా ఉండాలని అందరూ చెప్పేవారు. అలాగే వీరిద్దరూ కూడా ప్రతి సారి ఏదో ఒక రూపంలో తమ ప్రేమని చూపించుకునేవారు. అయితే కరోనా కాలమైన రెండేళ్లలో ఏం జరిగిందో ఏమో కానీ సడెన్ గా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక సామ్ కూడా కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో చైతూతో విడిపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతూతో రూమ్ లో కలిసి ఉంటే ఇద్దరం ఒకరిని ఒకరు చంపేసుకునే స్థాయిలో ఉంటామని చెప్పింది.
దీనిద్వారా తమ మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని సామ్ చెప్పకనే చెప్పింది. చైతూతో విడిపోయిన తర్వాత అతని మీద కోపంతోనే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిందనే ప్రచారం కూడా నడిచింది. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సోలోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో సమంత ఉంది. యశోద సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే సామ్ మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో డిసీజ్ బారిన బారి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో చైతూతో పాటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆమెకి అండగా ఉంటూ మానసిక ధైర్యం అందించే ప్రయత్నం చేశారని టాక్. ఈ నేపధ్యంలో సామ్ మనసు మార్చుకొని మళ్ళీ చైతూతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుందని బోగట్టా. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేరుగా హైదరాబాద్ లో నాగార్జున ఇంటికి ఆమె రాబోతుందని ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది అక్కినేని ఫ్యామిలీ లేదంటే సామ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. త్వరలో తమ విడాకుల రద్దుపై సామ్, చైతూ కలిసి మీడియాకి క్లారిటీ ఇవ్వబోతున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.