సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ సమంత. ఈ అమ్మడు ప్రస్తుతం తన క్రేజ్ ని ఇంకా కొనసాగిస్తుంది. రంగస్థలం తర్వాత సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత చేసిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అయితే ఆమెకి ఇండియన్ వైడ్ గా పాపులారిటీ తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ దర్శకుల దృష్టి సమంతపై పడింది. ఇక ఇదే సమయంలో తెలుగులో ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలని కమిట్ అయ్యింది. ఈ రెండు సినిమాల మీద మంచి బజ్ ఉంది. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఒకటి కావడం విశేషం.
ఇదిలా ఉంటే యశోద అనే మరో సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతుంది. అలాగే విజయ్ దేవరకొండకి జోడీగా ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు హాలీవుడ్ హిట్ మూవీ సీటాబెల్ ఇండియన్ రీమేక్ లో నటిస్తుంది. ఈ మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ లో ఉన్న రోల్ లో నటిస్తుంది. ఇక ఈ మూవీలోయాక్షన్ ఎలిమెంట్స్ కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటుంది. దీనిలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో మరో క్రేజీ మూవీలో ఈ సమంత కన్ఫర్మ్ అయ్యింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హర్రర్ థ్రిల్లర్ గా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది. అయితే సమంత ఇప్పటికే తెలుగులో యూటర్న్, రాజుగారి గది 3 సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. ఓ విధంగా చెప్పాలంటే హర్రర్ జోనర్ ఆమెకి అచ్చిరాలేదని చెప్పాలి. మరి అలాంటి జోనర్ లో హిందీలో సినిమా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఇది హిందీలో సమంతకి డెబ్యూ మూవీ కావడం, అది కూడా సినిమాలో ఆమె ఘోస్ట్ పాత్రలో కనిపించబోతు ఉండటం ఆమె అభిమానులని టెన్షన్ పెడుతుంది అని చెప్పాలి.