Samantha: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారుండరు. తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందం అభినయం మాత్రమే కాకుండా టాలెంట్ ఉంటే ఎంత ఎత్తు వరకు అయినా ఎదగవచ్చు అని ఈమె నిరూపించింది. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ఏం మాయ చేసావే సినిమా తర్వాత వరుసగా చాలా సినిమాలు చేసి మంచి పేరును తెచ్చుకుంది. అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలో నాగచైతన్య సమంతలు ఇద్దరు ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత నాగచైతన్య సమంతలు పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం వీరిద్దరూ బానే ఉన్నా, కానీ ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న కారణం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎవరి లైఫ్ లో వారు బిజీ గా ఉన్నారు. ఇక సమంత సోషల్ మీడియా లో కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది.సమంత ఇటువంటి అనారోగ్య కారణం వల్ల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే ఇప్పుడు సమంత ఓ కొత్త పోస్ట్ తో సోషల్ మీడియా లో కనిపించింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Samantha:సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్..
అయితే సమంత ఆ పోస్ట్ లో ఒక ఆసక్తికరమైన కొటేషన్ షేర్ చేసింది. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవలేవు అని అర్థం వచ్చే ఇంగ్లీష్ అక్షరాల టీ షర్టును ధరించి ఉన్న చిత్రాన్ని ఆమె షేర్ చేసింది. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటో సమంతకు మాత్రమే తెలుసు. ఇక ఈమె ఈ పోస్ట్ ను ఎవరిని ఉద్దేశించి చెప్పిందో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఇది నాగచైతన్య ను ఉద్దేశించినది అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతే ఏమీ సమంత సోషల్ మీడియా లోకి తిరిగి వచ్చిందని కొంతమంది సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.