టాలీవుడ్ లో అన్యోన్య దంపతులుగా వెలుగొందిన సామ్,చై తాజాగా విడాకలు తీసుకున్నారు.ఈ విషయాన్ని చై,సామ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ వార్త విన్న సినీ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.తాజాగా సామ్ అక్కినేని వారు ఇస్తున్న భరణం ఆఫర్ ను రిజెక్ట్ చేశారని సమాచారం.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లికి ముందే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని ఆ అగ్రిమెంట్ ప్రకారం వీరిద్దరూ విడిపోయాక సామ్ చై నుండి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని కోరకూడదనే నిబంధన ఉందని అందుకే అక్కినేని వారిచ్చిన భరణం ఆఫర్ కు సమంత నో చెప్పిందని ప్రచారం జరుగుతుంది.