ప్రస్తుతం యావత్ సినీ అభిమానులను భాషతో సంబంధం లేకుండా ఆర్.ఆర్.ఆర్ మూవీ తన వైపు తిప్పుకుంది.ఈ మూవీలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్,అజయ్ దేవగన్,శ్రియ కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది.ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ మూవీ యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.అలాగే ఈ సినిమా విడుదలైన తర్వాత 4 నెలల పాటు కొత్త సినిమాలను బాక్స్ ఆఫీస్ బరిలో దించకండి ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ రన్ భారీగా ఉంటుందని అన్నారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 1 న టెలికాస్ట్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.