బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది.
సల్మాన్ ఖాన్ ప్రేయసిల జాబితా చాలా పెద్దది. అప్పటి నటి సోమి అలీ, ఐశ్వర్యరాయ్ నుంచి ఇప్పటి కత్రినా కైఫ్‌తో పాటు పలువురు హీరోయిన్స్ వరకు ఎంతో మంది సల్మాన్ ప్రేమలో మునిగితేలారు. అయితే భాయిజాన్ మాత్రమే ఎవరితో ప్రేమాయాణం సాగించిన అది కొంతకాలం వరకే.
ఆ తర్వాత ఎవరి దారులు వారే అన్నంటూ విడిపోయారు. అందుకే అయిదు పదుల వయసులో కూడా సల్మాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పిలిపించుకుంటున్నాడు. తాజగా సల్మాన్ ప్రియురాళ్ల జాబితాలో మరో భామ చేరింది.
కొంతకాలంగా భాయిజాన్ అమెరికా భామ సమంత లాక్‌వుడ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బీ-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత లాక్‌డౌన్‌లో సల్మాన్-సమంత లాక్‌వుడ్‌లు ఫాంహౌజ్‌లోనే ఉన్నారు. అప్పటి నుంచే వీరిద్దరు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
అంతేగాక సమంత లాక్‌వుడ్ కూడా సల్మాన్, అతడి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు హజరవ్వడం, భాయిజాన్ కుటుంబంతో తనకు ఎక్కువ అటాజ్‌మెంట్ కూడా ఉంది. దీంత సల్మాన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఓ దశలో ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇప్పడు అవన్ని సద్దుమణిగాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో సల్మాన్‌తో తన రిలేషన్‌పై తొలిసారిగా నోరు విప్పింది అమెరికా భామ.వీరి రిలేషన్ గురించి ఆ నోటా ఈనోటా మాట్లాడుకుంటూ చివరికి సమంత వరకు చేరడంతో ఆమె కొద్దిగా సీరియస్ అయ్యింది.
“ఇటీవల చాలా వార్తలు వింటున్నాను.. ప్రజలు చాలానే మాట్లాడతారు. కానీ, అందులో నిజం లేదు. నేను సల్మాన్ ని కలిశాను .. అతను చాలా మంచి వ్యక్తి. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమి లేదు. నేను సల్మాన్ ని కలిసినట్టే హృతిక్ ని కలిశాను.
కానీ అప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. అస్సలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు ” అంటూ ఘాటుగానే స్పందించింది.ఇక దీంతో సమంత కూడా సల్లు భాయ్ కి సెట్ కాలేదని తెలుస్తోంది. వీరిద్దరి రిలేషన్ నిజమని త్వరలోనే సల్మాన్ పెళ్లి అనే వార్తలు విని ఆనందపడిన అభిమానులు కాస్త మరోసారి నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఈ అమెరికా భామ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.గత నెలలో హృతిక్ రోషన్‌తో తీసుకున్న సెల్ఫీని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడం తెలిసిందే. కాగా ఆమె ‘షూట్ ది మూవీ’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.