Salman Khan : అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఇది అక్షరాలా నిజం. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. ఇక సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే హీరోహీరోయిన్లు మంచి ఫిజిక్ మెయిన్‌టైన్ చేయాల్సి ఉంటుంది. అలా మెయిన్‌టైన్ చేస్తే తప్ప ఎవరూ చూడను కూడా చూడరు. కాబట్టి ఆకలికి బ్రేకులు వేసి.. ఫాస్ట్ ఫుడ్‌కి బై చెబుతుంటారు నటీనటులు. ఒకవేళ తిన్నా కూడా దానికి అవసరమైనంత వ్యాయామాలు చేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇక వీరే కాదు.. వీరి డూపులు కూడా మాంచి ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడం అత్యవసరం.
హీరో సన్నగా ఉండి ఆయన డూప్ బండగా ఉంటే అస్సలు సెట్ అవదు కదా. దీని కోసం వారు కూడా నానా తిప్పలు పడుతుంటారు. ఇక ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు జిమ్ చేసి ఫిజిక్‌ను కాపాడుకుంటున్నారు. అయితే ఈ జిమ్ అతి అయినా ప్రమాదకరమే. ఈ విషయాన్ని మనం కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో పాటు పలు సందర్భాల్లో చూశాం. తాజాగా మన బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే కూడా జిమ్ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Salman Khan : దాదాపు 50 చిత్రాల్లో సల్మాన్‌కు డూప్‌గా..
ట్రైనర్ సాగర్ పాండేను హుటాహుటిన ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సల్మాన్ సాగర్ పాండే మృతిపట్ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు సల్మాన్ పోస్ట్ షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘భాయిజాన్’ మూవీ సెట్‌లో సాగర్ పాండేతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. సాగర్ పాండే ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్ పెట్టారు. కాగా.. సల్మాన్‌కు సాగర్ పాండే దాదాపు 50 చిత్రాల్లో డూప్‌గా నటించాడు.