Salaar villain : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సలార్ మూవీలో విలన్‌గా నటిస్తున్న భాస్కరరావు దుబ్బాక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్‌టీవీ ఛానల్‌తో తాజాగా మాట్లాడిన ఆయన.. ప్రభాస్ గురించి మాట్లాడేంత పెద్ద వాడిని కాదు కానీ.. ఆయన చాలా ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పుకొచ్చారు.
ఇంకా భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారు అంత ఫాస్ట్‌గా సీన్ చేస్తారని నేను భావించలేదు. మేమంతా ఎలా అవుతుంది ఈ సీన్ అని చూస్తా ఉంటాం. సర్ ఫటాఫట్ చేసి వెళ్లిపోతారు. జస్ట్ సింగిల్ టేక్ అంతే.అది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది.. అందుకే వాళ్లంత పెద్ద స్టార్స్ అయ్యారని. అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంది. ఆయనను సెట్స్‌లో చూసి నేను చాలా హ్యాపీ ఫీలయ్యా. కెమెరా ముందు ఆయన్ను లైవ్‌గా చూడటం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. సాహోలో ప్రభాస్ గారికి, సలార్‌లో ప్రభాస్ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.
Salaar villain : ప్రభాస్ చాలా ఈజీగా మూవ్ అవుతారు..
‘‘సలార్, సాహోకి టోటల్లీ ఒక డిఫరెంట్ మూవీ. ప్రభాస్ గారు ఈ సినిమాలో ఇంటర్నేషనల్ లెవల్లో కనిపిస్తారు. ఈ సినిమా కేజీఎఫ్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎఫర్ట్స్ పెడితే ఏదైనా చేయగలమనే ఒక గుడ్ లెస్సన్‌ను ప్రభాస్ గారి నుంచి నేను నేర్చుకున్నా. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే గ్రేట్ లెస్సన్‌ను ప్రతి ఒక్కరూ ఆయన నుంచి నేర్చుకుంటారు. ఆయన తన ఫ్యాన్స్‌కి గానీ.. టీమ్‌లో ఎవరున్నా కానీ ఎంత బాగుంటారంటే.. చాలా ఈజీగా మూవ్ అవుతుంటారు. అలాంటివి అందరికీ రావు.చాలా మందిని చూస్తుంటాం. ఏవో రెండు, మూడు సినిమాలు చేయగానే మనకు మనమేదో గొప్పగా అనుకుంటాం. ఇంటర్నేషనల్ లెవల్‌లో స్టార్ డమ్ వచ్చినా కూడా ఆయన చాలా సింపుల్ పర్సన్’’ అని భాస్కర్ దుబ్బాక తెలిపారు.