ప్రస్తుతం సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసి మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ తరహాలో ఇప్పటికే చాలామంది నటీనటులు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఇది వరకు రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ కి ఏకంగా ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ అయ్యేలా ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది . .

ఈ క్రమంలో మరో మల్టీ స్టారర్ పేర్లు తెర మీదకి వచ్చాయి . ఈ జంట కోసం సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి కోరిక అని కూడా చెప్పొచ్చు . అదెవరో కాదండి మెగాస్టార్ చిరంజీవి మరియు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ చిరకాల కోరికను పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీర్చేస్తున్నట్టు చిత్ర వర్గాల సమాచారం . ఈ మెగా కాంబో ఒక సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. కేవలం మెగా అభిమానులే కాదు సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఈ కోరికే కోరుకుంటున్నాయి.
చిరంజీవి – రామ్ చరణ్ ఇద్దరు ఓకే తెర పై కనిపించాలనేదే మెగా అభిమానుల ఆశ.
ఇది వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది అందువలన వీరిద్దరూ కాంబోలో ఇంకో సినిమా తీసి హిట్ కొట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు ఆ కోరిక నేను తీరుస్తా అంటూ ముందుకు వచ్చాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి అధికారికంగా ప్రకటన త్వరలోనే రాబోతుంది.ప్రస్తుతం సలార్ 2 సినిమాలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.