Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న చిత్రం సలార్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ రేంజ్ కి వెళ్లిపోయాడో అందరికి తెలిసిందే. ప్రతి సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో మరియు రాధేశ్యామ్ సినిమాలు ప్యాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని తీసినవే. అయితే ఆ సినిమాలు ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా ప్రభాస్ తర్వాతి సినిమాలైన సలార్ మరియు ఆదిపురుష్ పైనే ఉన్నాయి. ఇక సలార్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కేజిఎఫ్ సినిమాతో విజయంతో ఈ ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఒక్క సారిగా టాప్ దర్శకులు లిస్టులో చేరిపోయాడు.
ఇక అలాంటి డైరెక్టర్ మరియు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇద్దరు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యే కన్నడ ఇండస్ట్రీలో రిలీజైన ఒక సినిమా ఎంతటి హైప్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా క్లైమాక్స్ గురించే ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పందించారు. దీనిపై మాట్లాడుతూ సలార్ సినిమా క్లైమాక్స్ కూడా ఇంత కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పాడు.
Salaar: సలార్ క్లైమాక్స్…
సలార్ సినిమాలో యాక్షన్ సీన్లు వేరేలా ఉంటాయని తెలుస్తుండగా.. క్లైమాక్స్ ఏ లెవల్ లో ఉండబోతుందనే చర్చ మొదలైంది. అయితే సలార్ క్లైమాక్స్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సలార్ క్లైమాక్స్ లో సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి.
అటు ప్రభాస్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా అభిమానులు చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇక ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పై ఇలాంటి అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఇంకా అంచనాలు పెంచుకున్నారు. ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది.