యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో హై ఓల్టేజ్ మూవీగా ఈ చిత్రాన్ని కేజీఎఫ్ తరహాలో ఆవిష్కరించే ప్రయత్నం ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ సలార్ మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసాయి.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ లీడర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఓ మాఫియా డాన్ దగ్గర పనిచేస్తూ అతనిని దాటుకొని పెద్ద డాన్ గా సలార్ ఎలా ఎదిగాడు అనేది సినిమా కథ. పీరియాడిక్ ఫిక్షన్ గానే ఈ సినిమాని ప్రశాంత్ ఆవిష్కరిస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ పవర్ ప్యాక్డ్ మూవీ కోరుకుంటున్నారు. సాహూ, రాధేశ్యామ్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేకపోయాయి. సినిమా కలక్షన్స్ పరంగా బాగానే వచ్చిన డిస్టిబ్యూటర్స్ కి మాత్రం ఈ రెండు సినిమాలు నష్టాలు మిగిల్చాయి.
ఇక ఫ్యాన్స్ కూడా ఆ రెండు సినిమాల విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సలార్ సినిమాని మరో కేజీఎఫ్ లా చూడాలని ఊహించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సలార్ సినిమా ఎలా ఉండబోతుంది అని నెటిజన్ ప్రశ్నకి సలార్ టీమ్ నుంచి వయొలెంట్ అని ఒకే ఒక పదం ట్విట్టర్ లో పోస్ట్ గా ఆన్సర్ వచ్చింది. ఈ ఒక్క పదం సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ సక్సెస్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.