ఎనర్జిటిక్ హీరో రామ్, బోయపాటి కాంబినేషన్ లో మాస్ మసాల మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఆవిష్కరించాలని బోయపాటి అనుకుంటున్నారు. అయితే బడ్జెట్ విషయంలో నిర్మాత, దర్శకుడు మధ్య కొన్ని చర్చలు నడుస్తున్నాయి. బోయపాటి ఇచ్చిన బడ్జెట్ ఏమైనా కొద్దిగా తగ్గిస్తే సినిమా వీలైనంత వేగంగా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో పరిణీతి చోప్రాని ముందు హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ఆమె అయితే హిందీలో కూడా కొంత బజ్ వస్తుందని భావించారు. అయితే ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ కి నిర్మాత చేతులు ఎత్తేయడంతో మరో ఆప్సన్ చూసుకున్నారు.
ఇక హిందీలో ఏ హీరోయిన్ ని కదిపిన పాన్ ఇండియా సినిమా అనేసరికి రెమ్యునరేషన్స్ అమాంతం పెంచేసి చెబుతున్నారు. దీంతో కొత్త హీరోయిన్ తో వెళ్లడం బెటర్ అనే నిర్ణయానికి బోయపాటి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో అఖిల్ ఏజెంట్ సినిమాతో పరిచయం అవుతున్న సాక్షి వైద్యని రామ్ కి జోడీగా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొత్త హీరోయిన్ కావడంతో రెమ్యునరేషన్ పరంగా కూడా ఆమె నుంచి పెద్ద డిమాండ్ ఏమీ ఉండదు. నిర్మాత ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది.
ఎలాగూ ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హీరోయిన్ ని పెట్టుకోవడంతో ద్వారా తమ సినిమాకి ఎంతో కొంత బజ్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఆలోచించి ఆ బ్యూటీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక బోయపాటి సినిమా అంటే ఎలాగూ హీరోయిన్ పాటలకి మాత్రమే పరిమితమయ్యే పాత్ర కావడంతో కమర్షియల్ గా తనకి ఎస్టాబ్లిష్ మెంట్ వస్తుందని సాక్షి వైద్య కూడా ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారికంగా ఆమె పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.