Sajjala’s son: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ కి వైసీపీలో కీలక పదవి దక్కింది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు అధ్యక్షుడిగా ఆయనను సీఎం వైఎస్ జగన్ నియమించారు. దీంతో వైసీసీ సోషల్ మీడియా మొత్తం ఆయన కంట్రోల్ లోకి వెళ్లనుంది. అయితే సోషల్ మీడియా మేనేజ్ మెంట్ కు సంబంధించి ఎలాంటి అవగాహన లేని భార్గవ్ కి సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాకు సంబంధించిన భార్గవ్ కి ఎలాంటి టచ్ లేదు. వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరితోనూ ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు. సోషల్ మీడియా ప్రచారం, క్యాంపెయిన్స్ గురించి భార్గవ్ కు పెద్దగా తెలియదు.
దీంతో అలాంటి వ్యక్తి భుజం మీద వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను జగన్ పెట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియాలో బాగా స్ట్రాంగ్ గా ఉంది. ప్రశాంత్ కిషోర్ సూచనలతో వైసీపీ సోషల్ మీడియాలో బాగా బలంగా తాయారైంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వైసీపీ సోషల్ మీడియా బాగానే సక్సెస్ అయింది. జగన్ వాయిస్ ను సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ గత ఎన్నికల తర్వాత వైసీసీ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదు.
అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు దగ్గర పడటంతో సోషల్ మీడియాను స్ట్రాంగ్ చేయాలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది. అందుకే ఇప్పటినుంచే ఆ పనిని స్పీడప్ చేయాలని జగన్ భావించారు. సోషల్ మీడియా బాధ్యతలను భార్గవ్ కి అప్పగించారు. కానీ సోషల్ మీడియాలో ఆయనకకు ఎలాంటి అవగాహన లేదు. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉండే పలు వ్యాపారాలు చేసుకన్నారు. సోషల్ మీడియాతో ఆయనకు అసలు సంబంధమే లేదు.
Sajjala’s son:
దీంతో పాత సోషల్ మీడియా కార్యకర్తలు భార్గవ్ కి సహకరిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారిది. అందరినీ కలుపుకకుని పోయి సోషల్ మీడియా వింగ్ ను భార్గవ్ బలోపేతం చేస్తారా అనేది చర్చగా మారింది. గత ఎన్నికల తర్వాత వైసీపీ సోషల్ మీడియా చిన్నాభిన్నం అయింది. కార్యకర్తలెవరూ యాక్టివ్ గా లేరు. ఎన్నికల తర్వాతఎవరి పని వారు చేసుకుంటున్నారు. స్వచ్చంధంగా ముందుకొచ్చి చేసేవారు చాలా తక్కువయ్యారు.