నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైసిపి సర్కార్ ప్రత్యర్థుల పై దాడులకు తెగబడుతూ రౌడీ పాలన చేస్తుందని అందుకే రాష్ట్రంలో ఆర్టికల్ 356 ని అమలు చేయాలని ఆయన కోరారు.తాజాగా చంద్రబాబు నాయుడు డిమాండ్ పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు.
పార్టీ నాయకులకు తాళం వేయడం చేతకాని చంద్రబాబు నాయుడే నిన్నటి ఘటనలకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.పట్టాభి వ్యాఖ్యలను ఖండించాల్సిన చంద్రబాబు నాయుడు మాట్లాడే స్వేచ్చ మాకు లేదా అంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.